మంత్రి మహేందర్ రెడ్డికి జేజేలు..!

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

మంత్రి మహేందర్ రెడ్డికి జేజేలు..!
– శుభాకాంక్షల తెలిపిన తాండూరు బీఆర్ఎస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా చోటు దక్కించుకున్న పట్నం మహేందర్ రెడ్డికి తాండూరు బీఆర్ఎస్ నేతలు జేజేలు పలికారు. గురువారం హైదరాబాద్‌ వెళ్లి శుభాకంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మహేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కింది. గురువారం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిపై, సీఎం కేసీఆర్ సమక్షంలో రాష్ట్ర కేబినెట్ మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో భాగంగా తాండూరుకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్లు ప్రవీణ్ గౌడ్, రాము, మాజీ కౌన్సిలర్లు అనురాధ, జుబేర్ లాల, తాండూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు మేఘనాథ్ గౌడ్, సర్పంచులు అమృత్ రెడ్డి, లాల్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు రవిశిందే, ప్రధాన కార్యదర్శి కె.శాంతు, నేతలు డీ. రవీందర్, ఎస్. పండరి, జినుగుర్తి శ్రీనివాస్ గౌడ్, న్యాయవాది నరేందర్ ముదిరాజ్, నరేష్ గౌడ్, శ్యామప్ప ముదిరాజ్, యువనాయకులు రఘు, కోటం రాజు, నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివెళ్లి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!