సౌత్ జోన్ క్రికెట్ లో తాండూరు విద్యార్థుల సత్తా

క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

సౌత్ జోన్ క్రికెట్ లో తాండూరు విద్యార్థుల సత్తా
– రన్నరప్స్ గా సహారా క్రికెట్ జట్టు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ స్కూల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటి సౌత్ జోన్ టీ 20 క్రికెట్ టోర్నమెంట్ లో తాండూరు లోని సహారా క్రికెట్ అకాడమీ జట్టు సత్తా చాటింది. హోరాహోరి పోటీలో రన్నరప్స్ గా నిలిచారు. ఈనెల 17 నుండి 20 వరకు హైదరాబాద్ లో జరిగిన పోటీల్లో 12 జట్లు పాల్గొన్నాయి. దక్షిణ భారతదేశం నుండి కర్నాటక, ఒడిస్సా, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ నుండి హైదారాబాద్, తాండూరు సహారా క్రికెట్ అకాడమి జట్లు పాల్గొన్నాయి . ఈ టోర్నీలో తాండూరు జట్టుకు చెందిన సాయి వర్షిత్ రెడ్డి 13 వికెట్లతో ఉత్తమ బౌలర్ గా, కనవ్ పండిత్ 9 డిస్మిజల్స్ తో ఉత్తమ కీపర్ అండ్ ఫీల్డ్ గా నిలిచారు.

సహారా క్రికెట్ అకాడమీ కోచ్ జగన్నాథ్ రెడ్డి , తల్లిదండ్రులు, పలు పాఠశాలల యాజమాన్యాలు ప్లేయర్స్ కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా క్రికెట్ కోచ్ జగన్నాథ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచి క్రీడల పట్ల ఆసక్తిని ఘనపరిచాలన్నారు విద్యార్థుల మానసిక శారీరక దృఢత్వానికి క్రీడలు దోహదపడతాయన్నారు తాండూర్ లో బాల బాలికల కోసం ప్రతినిత్యం సహారా క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక సెయింట్ మార్క్స్ స్కూల్ ఆవరణలో క్రికెట్ కోచింగ్ ఇస్తున్నామన్నారు. మట్టిలో మాణిక్యాలు దాగుంటాయని, గ్రామీణ ప్రాంతాల నుండి సైతం అంతర్జాతీయ స్థాయి క్రికెట్ కు విద్యార్థులు ఎదుగుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి….

జామా జ్యూస్‌లో ఆరోగ్య రహస్యాలు..!