వార్డుల అభివృద్దికి కృషి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

వార్డుల అభివృద్దికి కృషి..!
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– గ్రీన్‌సీటిలో సీసీ డ్రైన్‌ పనుల ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. శనివారం పట్టనంలోని 13వ వార్డు గ్రీన్ సిటీ కాలనీలో ఉన్న మసీదు సమీపంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 5లక్షలతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ హాజరై నిర్మాణ పనులు ప్రారంభించారు.

ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని వార్డుల అభివృద్ధికి నిధులు కేటాయించి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, ఇతర మౌళిక సదుపాయాల పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. అన్ని వార్డుల్లో మురుగు కాలువలు నిర్మించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేలా కృషి చేయడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో అన్ని వార్డులను అభివృద్ధి చేసేలా దృష్టి సారిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, వార్డు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ట్రైన్‌లో గోవా మద్యం బాటిళ్లు..!