కాంగ్రెస్, బీజేపీలకు ఓటుతో బుద్ది చెప్పాలి
– సంక్షేమాన్ని అందించిన బీఆర్ఎస్‌ను ఆదరించాలి
– తాండూరు ఇందిరా నగర్‌లో నేతల జోరు ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : మోసపూరితంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు ఓటుతో బుద్ది చెప్పాలని తాండూరు పట్టణ బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. బుధవారం తాండూరు పట్టణం ఇందిరానగర్ 2వ వార్డులో బీఆర్ఎస్ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు యూనుస్ ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముదిరాజ్ సంఘం నాయకులు ఎస్పీ రవికాంత్ హాజరయ్యారు.
పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి వారు ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తరుపున ప్రచారం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ జూటాకోర్ పార్టీలుగా మారాయని విమర్శించారు. ఇచ్చిన హామిలను అమలు చేయకపోవడంతో పేదలు ఎంతో నష్టపోతున్నారని అన్నారు.
కేంద్రంలో పదేళ్లు ఉన్న బీజేపీ పేదలకు ఏం చేయలేదన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఇచ్చిన హామిలను విస్మరించిందన్నారు. పేదల సంక్షేమానికి పాటుపడిన బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. కాసాని జ్ఞానేశ్వర్‌కు భారీ మెజార్టీ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎజాజ్, గార్బీఎల్, శంషేర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

