అదరగొట్టిన నేతాజీ స్కూల్ విద్యార్థులు
– మిల్లేటోపీయా పోటీలలో ప్రభంజనం
– ఆరు బహుమతలు సాధించిన స్టూడెంట్స్
– అభినందించిన పాఠశాల యాజమాన్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల పాఠశాల విద్యార్థులు అదరగొట్టారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీలో డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్సెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిల్లేటోపీయా పోటీలలో ప్రభంజనం సృషించారు. పాఠశాల నుంచి మొత్తం 1400ల మంది విద్యార్థులు పాల్గొనగా ఏకంగా ఆరు విభాగాల్లో సత్తా చాటారు. వివిధ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి పోటీ ఎదుర్కొని బహుమతులు సాధించారు.
డిబేట్ పోటీలో పీ.కార్తిక్(10వ తరగతి), పి. విజయలక్ష్మీ (9వ తరగతి)లు ఒక్కోటి చొప్పున మొదటి బహుమతులు, క్విజ్ పోటీలలో తనుష్ రెడ్డి(10వ తరగతి), హర్షితారెడ్డి (10వ తరగతి)లు ఒక్కోటి చొప్పున రెండో బహమతులు, చిత్రలేఖనంతో పాటు స్కిట్ కాంపీటేషన్లో జస్వంత్ రెడ్డి(10వ రతగతి) ఒక్కో విభాగంలో మూడో బహుమతి సాధించి సత్తా చాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైస్ చాన్స్ లర్ జగదీశ్వర్ రావు చేతుల మీదుగా బహుమతులను అందుకున్నారు.
ఈ సందర్భంగ పాఠశాల డైరెక్టర్ మణిమాల తమ పాఠశాల విద్యార్థులు మిల్లేటోపియా పోటీలలో ప్రతిభను కనబరిచి బహుమతులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆమెతో పాటు ప్రిన్సిపల్ శివలీల, ఉపాధ్యాయులు మల్లికార్జున్ రెడ్డి, శ్వేత, శ్రీకాంత్, నందిని రెడ్డి, మాధురి, సంతోషి, ప్రియాంక, శ్రీశైలం, భాగ్యశ్రీలు బహుమతులు సాధించిన విద్యార్థులను అభినందించారు.
ఇదికూడా చదవండి…

