గులాబీ విధేయులకే పెద్దపీట..!

తాండూరు రాజకీయం వికారాబాద్

గులాబీ విధేయులకే పెద్దపీట..!
– మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి రావాలి
– బల్దియాపై బీఆర్ఎస్ జెండా ఎగరవేద్దాం.
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– కౌన్సిలర్ అభ్యర్థులకు బీఫారాల అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీకి కోసం పనిచేసిన నాయకులకే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీఫారాలను అందజేశారు.

మంగళవారం తాండూరు పట్టణంలోని పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి. మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు, మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, డా. సంపత్ కుమార్ తదితరుల సమక్షంలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు బీ ఫారాలను అందజేశారు. ఈ సందర్బంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీకోసం, తాండూరు అభివృద్ధి కోసం పనిచేసే నాయకులను గుర్తించి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ హాయాంలో ప్రజల కోసం అమలు చేసిన పథకాలు. సంక్షేమాలను వివరించాలని అన్నారు. స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగాలని అన్నారు. ఎన్నికల్లో గెలిచి వచ్చి.. మున్సిపల్ కార్యాలయంలో పై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీనివాస్ చారి, నరేందర్ గౌడ్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థులు వీళ్లే….
1వ వార్డు నాగలక్ష్మి అనంత్ రెడ్డి, 2వ వార్డు వినయ శీల ఎబినేజర్, 3వ వార్డు నిషా తునిషా అంజద్, 4వ వార్డు అనూష బాయి బీంసింగ్, 5వ వార్డు ఇర్ఫానా భేగం రజాక్, 6వ వార్డు అనిల్ ఆర్మీ, 7వ వార్డు ఈర్షాద్. 8వ వార్డు జావిద్, 9వ వార్డు పట్లోళ్ల దీపా నర్సింలు, 10వ వార్డు పట్లోళ్ల నర్సింలు, 11వ వార్డు రాజేష్ చారీ, 12వ వార్డు ఎంపీ యూసుప్ బాబా, 13వ వార్డు సురేష్ నాయక్, 14వ వార్డు నాజియా సారా అబ్రార్, 15వ వార్డు శోభారాణి సంజీవరావు, 16వ వార్డు ఎర్రం వసంత శ్రీధర్, 17వ వార్డు ఆఫ్రీన్ భేగం, 18వ వార్డు సంజీవరావు, 19వ వార్డు బొంబీనా, 20వ వార్డు నవీనా సంతోష్ గౌడ్, 21వ వార్డు టిప్పు, 22వ వార్డు భాస్కర్, 23వ వార్డు పరిమళ రవీందర్, 24వ వార్డు కోట్రిక నాగలక్ష్మి శ్రీకాంత్, 25వ వార్డు నసీరా భాను, 26వ వార్డు బంటారం రూపాలి సుధాకర్. 27వ వార్డు బొప్పి సుకన్య కృష్ణ, 28వ వార్డు అనురాధ రవీందర్, 29వ వార్డు సుమిత్ గౌడ్ (సిద్దూ), 30వ వార్డు సబియా ఫాతిమా, 31వ వార్డు యోగానంద్, 32వ వార్డు మ హేశ్వరి సంతోష్, 33వ వార్డు నరుకుల నరేందర్ గౌడ్, 34వ వార్డు సుప్రీత కరుణాకర్, 35వ వార్డు ఫాతిమా సఫియా, 36వ వార్డు రూప రుద్రుపాటిల్.

ఇదికూడ చదవండి…

విద్యుత్ షాక్‌తో ప్రభుత్వ టీచర్ మృతి..!