బెట్టింగ్‌పై స్పెషల్ ఫోకస్..!
– కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆర్డర్
– ఇసుక, గుట్కా, బియ్యం రవాణాపై దృష్టి
– పోలీసు అధికారులతో సమీక్ష
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : జిల్లాలో బెట్టింగ్ కార్యకలాపాలపై పోలీసు యంత్రాంగం స్పెషల్ ఫోకస్ పెట్టేందుకు సిద్దమవుతోంది. బెట్టింగ్, జూదం, ఇతర అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణ రెడ్డి జిల్లాలో బెట్టింగ్, జూదం, మరియు ఇతర అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రాధాన్యతతో తీసుకుని త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళలపై జరిగే నేరాలు, పిల్లలపై అఘాయిత్యాలు, మరియు సైబర్ నేరాలకు సంబంధించి వేగంగా దర్యాప్తు జరిపి న్యాయం కల్పించాలన్నారు.రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రమాదాలకు కారణాలు విశ్లేషించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాల్లో కళాజాత బృందాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఎర్రమట్టి ఇసుక, గుట్కా, మరియు PDS బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందిన సందర్భంలో వెంటనే దాడులు నిర్వహించి, కేసులు చేయాలని అధికారులకు ఆదేశించారు.

ప్రజల్లో సీసీటీవీ కెమెరాలపై అవగాహన కల్పించడానికి, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. CCTV లు నేరాల నిరోధకతకు ఎంతగానో ఉపయోగపడుతాయి అని ఇట్టి విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని, జిల్లాలో నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్, ఓపెన్ బుజింగ్, మరియు వాహనాల తనిఖీలు నిర్వహించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. E-Petty కేసుల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని, నిత్యం నిఘా పెట్టి నేరాలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.కేసులలో నిందితులకు త్వరగా శిక్షలు విధింపచేయించేందుకు కోర్ట్ మానిటరింగ్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.అనంతరం జిల్లా ఎస్పీ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న ప్రతి ఒక్క ఫంక్షనల్ వర్టికల్ గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా డీఎస్పీలు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, బాలకృష్ణ రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ జానయ్య, జిల్లా ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

