స్టోన్ మ‌ర్చ‌ట్ వెల్పేర్ అసోసియ‌ష‌న్ అధ్య‌క్షులుగా అఫ్పూ

తాండూరు వికారాబాద్

స్టోన్ మ‌ర్చ‌ట్ వెల్పేర్ అసోసియ‌ష‌న్ అధ్య‌క్షులుగా అఫ్పూ
– ఏక‌గ్రీవంగా ఆయ‌న ప్యాన‌ల్ ఎన్నిక
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు స్టోన్ మర్చంట్స్ వెల్పేర్ అసోసియేష‌న్ అధ్య‌క్షులుగా అఫ్పూ(న‌యూం) ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఆయ‌న‌తో పాటు ఆయ‌న కార్య‌వ‌ర్గం కూడ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యింది. స్టోన్ మ‌ర్చంట్ వెల్పేర్ అసోసియేష‌న్‌కు నిర్వ‌హించిన ఎన్నిక‌ల ఫ‌లితాలు గురువారం రాత్రి వెలువడ్డాయి. అసోయేష‌న్ నూత‌న కార్య‌వ‌ర్గం కోసం అఫ్పూ(న‌యూం) 16 మంది కార్య‌వ‌ర్గ స‌భ్యుల‌తో క‌లిసి నామినేష‌న్ వేశారు. ఇందుకు ప్ర‌త్య‌ర్థులుగా ఎవ్వ‌రు నామినేష‌న్ వేయ‌క‌పోవ‌డంతో అఫ్పూ(న‌యూం) ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఆయ‌న‌తో పాటు కార్య‌వ‌ర్గ స‌భ్యులు కూడ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. అనంత‌రం జ‌రిగిన అధ్య‌క్ష ప‌ద‌వి కోసం కూడ అఫ్పూ(న‌యూం)కు వ్య‌తిరేకంగా నామినేష‌న్ దాఖ‌లు కాక‌పోవ‌డంతో తాండూరు స్టోన్ మ‌ర్చంట్ వెల్పేర్ అసోసియేష‌న్ అధ్య‌క్షులుగా అఫ్పూ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు.
అదేవిధంగా అసోసియేష‌న్ ఉపాధ్య‌క్షులుగా కుంచెం ముర‌ళిధ‌ర్, అబ్దుల్ స‌మ‌ద్, కార్య‌ద‌ర్శిగా మీర్జా ఫ‌యాజ్, కోశాధికారిగా సంజీవ్ కుమార్‌లు నియామ‌కం అయ్యారు. ఈ అసోసియేష‌న్‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎన్నిక‌ల అధికారిగా కోస్గి తిప్ప‌య్య వ్య‌వ‌హ‌రించారు. నూత‌న కార్య‌వ‌ర్గ స‌భ్యుల‌కు ఎన్నిక‌, నియామ‌క‌ప‌త్రాల‌ను అంద‌జేశారు. అనంత‌రం నూత‌న అధ్య‌క్షులుగా ఎన్నికైన అఫ్పూ మాట్లాడుతూ త‌న‌పై న‌మ్మ‌కంతో ఏక‌గ్రీవంగా అధ్య‌క్షునిగా ఎన్నుకున్న ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. అధ్య‌క్షులుగా అంద‌రి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించి ప‌ద‌వికి వ‌న్నే తీసుక‌వ‌స్తాన‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో స్టోన్ అసోసియేష‌న్ స‌భ్యులు, వ్యాపారులు పాల్గొన్నారు.