నిరు పేదలకు ఇళ్ల మంజూరే లక్ష్యం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

నిరు పేదలకు ఇళ్ల మంజూరే లక్ష్యం..!
– లబ్దిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలు కీలకం
– సంక్షేమ పథకాల అమలు కూడా కమిటిలు పనిచేయాలి
– బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం.
– రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటేడ్ స్కూల్ నిర్మాణం
– పట్టణంలో రూ.500కోట్లతో అండర్ డ్రైనేజీ వ్యవస్థ
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేస్తూ ఇందిరమ్మ పథకం కింద ఇండ్లను మంజూరు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణం కోడంగల్ రోడ్డు మార్గంలోని ఎస్వీఆర్ గార్డెన్ లో ఇందిరమ్మ కమీటీలతో సమావేశం జరిగింది.

ఈసమావేశానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో నిరు పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఇందిరమ్మ పథకం కింద అర్హులైన పేదలకు ఇంటిని మంజూరు చేయడం సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం 3500ల ఇండ్లను మంజూరు చేసిందని, ప్రతి మండలానికి ఒక పైలెట్ గ్రామాన్ని ఎంపిక చేసి 2. ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటిలు కీలకంగా పనిచేయాలన్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు సమన్వయంతో కలిసి -పనిచేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికతో పాటు గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను తీసుకోవాలని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు రూ.21 వేల రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందించడంతో పాటు మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వ బడ్జెట్ లో కూడా సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేసిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు కులగణన చేపట్టిందని, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణతో ఆయా వర్గాలకు సామాజిక న్యాయం చేస్తుందని అన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేసేందుకు దృష్టి సారిస్తుందన్నారు. అంతేకాకుండా తాండూరులో అన్ని గ్రామాలకు, తాండాలకు రోడ్ల నిర్మాణం, సీసీ డ్రైన్లు నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. త్వరలోనే రూ.200ల కోట్లతో ఇంటిగ్రేటేడ్ స్కూల్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. అతిత్వరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. తాండూలోరు గొల్ల చెరువు, చిలుకవాగు ప్రక్షాళన చేపట్టి వరద ముప్పును తీరుస్తామన్నారు.

అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ సభ్యులు ఎం.రమేష్ మహారాజ్, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, కోట్ పల్లి మార్కెట్ కమిటి చైర్మన్ అంజయ్య, పీఏసీఎస్ చైర్మన్లు సురేందర్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్. మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జన్నె నాగప్ప, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు మురళీ గౌడ్, భీప్ప, మాజీ ప్రజా ప్రతినిధులు, ఇందిరమ్మ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

బాలికల విద్యకు ప్రోత్సహం..!