బాలికల విద్యకు ప్రోత్సహం..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

బాలికల విద్యకు ప్రోత్సహం..!
– ఉచిత ఎంసెట్ శిక్షణ అభినందనీయం
– ఆర్బీఓఎల్ ఎండి బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి
– భాష్యం కాలేజీలో ఎంసెట్ తరగతులు ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : బాలికల విద్యకు ప్రోత్సహాం అందించేందుకు ముందుంటామని తాండూరు ఆర్బీఓఎల్ ఎండీ బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సేవా భారతి, హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో పట్టణంలోని భాష్యం కాలేజీలో బాలికల కోసం ఎంసెట్(ఈఏపీసెట్) శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు.

ఆదివారం సరళా శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికల విద్యా ప్రోత్సహానికి ఎల్లప్పుడు ముందుంటామని అన్నారు. బాలికల కోసం సేవా భారతి, హిందూ ధార్మిక పరిషత్ ఎంసెట్ శిక్షణ తరగుతులు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ శిక్షణ తరగతులు బాలికలు సద్వినియోగం చేసుకోవాలి, మంచి ర్యాంకులు సాధించి తల్లిదండ్రులకు -పేరు తీసుకరావాలని ఆకాంక్షించారు. అదేవిధంగా విద్యారంగానికి పేరొందిన దేశ రాజధాని ఢిల్లీ మాదిరిగా తాండూరును రెండో దుబాయ్ గా కాకుండా రెండో ఢిల్లీగా మార్చాలని కోరారు. మరోవైపు సోమవారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ప్రతినిధులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక పరిషత్ కన్వినర్ గాజుల బస్వరాజ్, సిద్దార్థ కాలేజీ ప్రిన్సిపల్ నరెందర్, సింధూ బాలికల కాలేజీ ప్రిన్సిపల్ సంగీత, భాస్యం కాలేజీ ప్రిన్సిపల్ సోమనాథ్, సేవా భారతి ప్రతినిధులు రమేష్, ప్రవీణ్ ( చిట్టిబాబు), హన్మప్ప సార్, హిందూ ధార్మిక పరిషత్ ట్రస్టీలు పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, పటేల్ విజయ్ కుమార్, ఓం ప్రకాష్ సోమాని, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

వైభవంగా.. మద్భగవద్గీత పారాయణం..!