రైలు నుంచి జారి పడిన యువకుడు

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

రైలు నుంచి జారి పడిన యువకుడు
– చికిత్స పొందుతూ మృతి
– అంతారం గ్రామంలో విషాదం
తాండూరు, దర్శిని ప్రతినిధి: రైలు నుంచి జారిపడిన వయకుడు తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. బయట కుటుంబంలో తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన మహేష్ ఓ కాంట్రాక్టర్ దగ్గర విద్యుత్ పననులు చేస్తున్నాడు. సోమవారం ఉదయం వికారాబాద్ నుంచి తాండూరు వైపు రైల్లో వస్తున్నాడు.

ధారూరు సమీపంలోకి రాగానే మహేష్ రైల్లో నుంచి అదుపుతప్పి కింద పడిపోయాడు. రైలు చక్రాలు రెండు కాళ్లపై నుంచి వెళ్లడంతో నుజ్జు నుజ్జు అయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం మహేష్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన మహేష్ రెండు కాళ్ళను తొలగించారు. పరిస్థితి విషమంగా మారడంతో మహేష్ ను హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు మహేష్ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మహేష్ మృతితో అంతారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి…

ఇతర వార్డుల ఓటర్లను తొలగించండి