ఆత్మీయత, మతసామరస్యతల కలయిక ఇఫ్తార్

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆత్మీయత, మతసామరస్యతల కలయిక ఇఫ్తార్
– మనషులంతా సోదర భావంతో ఉండాలి
– తెలంగాణ రాష్ట్ర చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి
– తాండూరులో ఇఫ్తార్కు నేతలతో కలిసి హాజరు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆత్మీయత, మతసామరస్యతల కలయికలకు ఇఫ్తార్ విందులు వేధికగా నిలుస్తాయని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు మహేందర్ రెడ్డి హాజరయ్యారు. మైనార్టీ నేలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్షలను విరమింప జేశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసం, పండగ పవిత్రమైందని అన్నారు. ఈ మాసంలో జరుపుకునే ఇఫ్తార్ విందులలో అన్నివర్గాల ఆత్మీయ కలయిక, మతసామరస్యతను చాటుతుందన్నారు. ఏ పండుగల సారమైన శాంతి సౌభ్రత్వమే అన్నారు. అందరు కలిసి మెలసి సొదర భావంతో ఉండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనీయర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, బీసీ కమీషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్, మైనార్టీ నాయకులు అబ్దుల్ రవూఫ్, అప్పూ(నయూం), యూసుఫ్ ఖాన్, ముస్తఫా పటేల్, యువనాయకులు బిర్కడ్ రఘు, శివానంద్, అశోక్, పలువురు మైనార్టీ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

దొడ్డి కొమురయ్య జయంతికి ఏర్పాట్లు చేయండి