రేపు మకర జ్యోతి దర్శనం

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు మకర జ్యోతి దర్శనం
– అయ్యప్ప మహాపడిపూజ
– తరలి రావాలని భక్తులకు ఆహ్వానం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం అయ్యప్ప నగర్లోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయంలో రేపు మకర జ్యోతి దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి యేడాది మాదిరిగానే సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాలయంలో అయ్యప్ప మహా పడిపూజ, మకర జ్యోతి దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

ఇందులో భాగంగా తాండూరు మండలం సంగెంకాలన్ సర్పంచ్ మేఘనాధ్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 5-05 గంటలకు అయ్యప్ప పడిపూజ జరుగుతుందని, అనంతరం 6-45 గంటలకు భక్తులకు మకర జ్యోతి దర్శనం ఉంటుందని వివరించారు. కావున తాండూరు పట్టణం, పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పడిపూజ, మకర జ్యోతి దర్శనంతో స్వామి కృపకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ కూడ ఉంటుందని తెలిపారు.