దొడ్డి కొమురయ్య జయంతికి ఏర్పాట్లు చేయండి

తాండూరు రాజకీయం వికారాబాద్

దొడ్డి కొమురయ్య జయంతికి ఏర్పాట్లు చేయండి
– మున్సిపల్ కమీషనర్‌కు కురువ సంఘం వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ సాయుధ పోరాట అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని తాండూరు కురువ సంఘం నాయకులు కోరారు. శనివారం తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిని కురువ -సంఘం ఆధ్వర్యంలో నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 3న దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకుని తాండూరు పట్టణం యశోధ నగర్ లో ఉన్న పార్కులో విగ్రహం వద్ద ఏర్పాట్లు చేయాలని కోరారు. విగ్రహం వద్ద చెత్త చెదారం తొలగించి.. పారిశుద్ధ్య పనులు చేయించాలని కోరారు. ఇందుకు కమీషనర్ సానుకూలంగా స్పందించినట్లు సంఘం నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నాగారం జగదీష్, ఉపాధ్యక్షులు పూజారి పాండు. పట్టణ అధ్యక్షులు మరాఠి నర్సింలు, పెద్దేముల్ అధ్యక్షులు గోపాలకృష్ణ, సాయిపూర్ కురువ మల్లేశం, దస్తగిరి కురువ నర్సింలు, కురువ నాగప్ప తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తాండూరు నేతలు