భద్రేశ్వర భక్తులకు బావనోళ్ల సేవ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

భద్రేశ్వర భక్తులకు బావనోళ్ల సేవ..!
– దాత శంకర్ యాదవ్‌ ద్వారా దాసోహం
– సన్మానించిన చైర్మన్, కమిటి సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జాతర ఉత్సవాల సందర్భంగా దేవాలయ రేనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్, ఆలయ కమిటి సభ్యుల ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన అన్నపూర్ణ మాత దాసోహ మందిరంలో భక్తులకు అన్నదానం కొనసాగిస్తున్నారు.

రెండో బుధవారం తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ దాతగా భక్తుల అన్నదానంకు సాయం అందించారు. ఈ సందర్భంగా శంకర్ యాదవ్ తండ్రి హన్మయ్య భద్రేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం దాసోహ మందిరంలో తండ్రి హన్మయ్యతో పాటు శంకర్ యాదవ్ మిత్ర బృందం జాతర ఉత్సవాలకు హాజరైన భక్తులకు అన్నదానం చేశారు. అంతకుముందు దాసోహంలో అన్నదానంకు సహకరించడం పట్ల దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, కమిటి సభ్యులు శంకర్ యాదవ్ తండ్రి హన్మయ్యను శాలువాతో ఘనంగా సత్కరించారు.

అనంతరం పటేల్ కిరణ్‌ కుమార్ మాట్లాడుతూ భద్రేశ్వర జాతర ఉత్సవాలు నిర్విఘ్నంగా జరిగేందుకు అందరు అందిస్తున్న సహాకారం అభినందనీయమని అన్నారు. రథోత్సవం, లంకాదహనం, పల్లకిసేవ కార్యక్రమాలకు పకడ్బందీగా నిర్వహిస్తూనే భక్తులకు నిత్య అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ శేఖర్ గౌడ్, వీరశైవ సమాజం, వీరశైవ యువదళ్ సభ్యులు, ఆలయ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి….

ఇండియా టీవీలో మనోడి జర్నీ..!