డబ్బుల్లేకున్నా రైల్లో వెళ్లొచ్చు..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

డబ్బుల్లేకున్నా రైల్లో వెళ్లొచ్చు..!
– ఐఆర్సీటీసీ కొత్త సర్వీస్
– రైల్వే ప్రయానికులకు ఉపయోగం
– ఎలా చేసుకోవాలో తెలుసుకోండి
దర్శిని డెస్క్ : రైల్వే ప్రయాణికులకు కోసం వివిధ రకాలుగా సేవలు అందిస్తున్న ఐఆర్‌సీటీసీ ఇప్పుడు కొత్త సర్వీస్‌ను లాంచ్ చేసింది. సామాన్యులకు భారతీయ రైల్వేలు అత్యంత సరసమైన, సౌకర్యవంతమైన ప్రయాణ మార్గంగా ప్రజలు భావిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ తీసుకవచ్చిన కొత్త సదుపాయంతో డబ్బుల్లేకున్నా.. చేతిలో రూపాయి లేకున్నా.. రైల్వేలో ప్రయాణించే అవకాశాన్ని అందిస్తోంది. అయితే పదండి మరీ ఈ సౌకర్యం రైల్వే ప్రయాణికులకు ఎలాంటి మేలు చేస్తోందో తెలుసుకుందాం.

రైలులో ప్రయాణించాలనుకునే వారికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రయాణికుల సౌలభ్యం కోసం ‘ఈ-పే లేటర్ ‘ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం ఈ-పే లేటర్ సౌకర్యాన్ని అందించడం కోసం ఫిన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఐఆర్‌సీటీసీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా ప్రయాణికులు తక్షణ చెల్లింపు లేకుండానే తమ రైలు టిక్కెట్లను బుక్ చేసుకుని 14 రోజుల్లోపు చెల్లింపును సౌకర్యవంతంగా చేసుకోవచ్చని పేర్కొంది. డిజిటల్ ఇండియాతో పాటు నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది.

ఈ వ్యవస్థ ద్వారా ప్రయాణీకులు క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ అవసరం లేకుండా టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి వీలు అవుతుంది. ఐఆర్‌సీటీసీ ఈ-పే లేటర్ అనేది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ వెబ్ సైట్, మొబైల్ అప్లికేషన్‌లో అందుబాటులో ఉండనుంది. ముఖ్యంగా రైలు టిక్కెట్ బుకింగ్ సమయంలో ఎలాంటి కార్డు నంబర్‌ను నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే వారి వాలెట్ బ్యాలెన్స్‌ను రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంది.

పలు నివేదికల ప్రకారం ఐఆర్‌సీటీసీ ద్వారా ప్రతిరోజూ 1 లక్షకు పైగా తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకుంటున్నారు. తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే వారికి ఐఆర్‌సీటీసీ ఈ-పే లేటర్ చాలా సౌకర్యంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే దేశీయ లేదా అంతర్జాతీయ ప్రయాణాలు ఇకపై ఈ-పే లేటర్ ఉపయోగించి ఏదైనా ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. అలాగే 14 రోజుల్లోపు చెల్లింపు చేయవచ్చు.

సేవలు పొందాలంటే ఇలా చేయండి..
ముందుగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా అప్లికేషన్‌లోకి లాగిన్ అవ్వాలి.
మీకు నచ్చిన రైలు, విమానం లేదా టూర్ ప్యాకేజీని ఎంచుకోవాలి.
అనంతరం పేమెట్ పేజీకి వెళ్లి ‘ఈ-పే లేటర్’ ఎంపికను ఎంచుకోవాలి.
అంతే మీ బుకింగ్ తక్షణమే పూర్తవుతుంది. అలాగే చెల్లింపు చేయడానికి మీకు 14 రోజుల సమయం ఉంటుంది

ఇదికూడా చదవండి…

మహారాష్ట్రలో మన తెలుగోడికి గౌరవం