వినాయక ఆసుపత్రికి రాష్ట్ర స్థాయి అవార్డు
– మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు ద్వారా అందజేత
– అందుకున్న హాస్పిటల్ డైరెక్టర్ డా. కేతావత్ రవీందర్ రాజా
– హర్షం వ్యక్తం చేసిన విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శాంతినగర్‌లో కొనసాగుతున్న వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రాష్ట్ర స్థాయి హెల్త్ అవార్డు దక్కింది. శుక్రవారం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన డాక్టర్లకు హైదరాబాద్ ఫిలింనగర్ JRC కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన VISSA హెల్త్ అవార్డుల పురస్కారాల అందజేత కార్యక్రమం నిర్వహించారు.

ఇందులో భాగంగా తాండూరు వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ అందుకుంది. మంత్రులు శ్రీధర్ బాబు సీతక్క చేతుల మీదుగా హాస్పిటల్లో విధులు నిర్వహి స్తున్న డాక్టర్ హాస్పటల్ డైరెక్టర్ కేతావత్ రవీందర్ రాజా వారి కుటుంబ సభ్యులు ఈ అవార్డును అవార్డును అందుకున్నారు. వినాయక ఆసుపత్రికి రాష్ట్ర స్థాయిలో అవార్డు అందడం పట్ల ఆసుపత్రి చైర్మన్ విట్టల్ నాయక్ సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన డాక్టర్‌ను అభినందించారు. అతి తక్కువ కాలంలోనే ప్రారంభించిన ఆరు నెలలలోపే రాష్ట్రస్థాయిలో వినాయక హాస్పిటల్ కు అవార్డు రావడం అభినందనీయమని అన్నారు. ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది కృషి వల్ల ఈ అవార్డు అక్కడ సంతోషకరంగా ఉందని డాక్టర్ రవీందర్ రాజా పేర్కొన్నారు. ఆసుపత్రిలో మరిన్ని మెరుగైన సేవలు అందించి.. ప్రతిష్ట పెంచేందుకు కృషి చేస్తామని అన్నారు.

ఇదికూడా చదవండి…

