ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతోనే అభివృద్ధి సాధ్యం
– సాయిపూర్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి
– సాయిపూర్ అభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యేకు రుణపడి ఉంటాం: బంటు మల్లప్ప
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం సాయిపూర్ 9వ వార్డులో వార్డు ఇంచార్జ్, సీనీయర్ నాయకులు బంటు మల్లప్ప ఆధ్వర్యంలో సీసీ రోడ్డు పనులను చైర్మన్ బాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఎస్టీఎఫ్ నిధులు రూ. 8లక్షలతో బంటు రాములు ఇంటి నుంచి బుగ్గమ్మ ఇంటి వరకు, వడ్డె శ్రీను ఇంటి నుంచి మేయిన్ రోడ్డు వరకు సీసీ రోడ్డు పనులు చేపట్టారు. ఈ పనులను ప్రారంభించిన బాల్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధికి నోచుకోని సాయిపూర్ ప్రాంతంలో ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధికి ఎన్ని కోట్ల నిధులైనా ఇచ్చేందుకు ముందు ఉన్నారని అన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్లు, లింకు రోడ్లు, కోట్లాది నిధులతో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తాండూరు అభివృద్ధే ధ్యేయంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు 9వ వార్డు ఇంచార్జ్, కాంగ్రెస్ సీనీయర్ నాయకులు బంటు మల్లప్ప మాట్లాడుతూ ఇబ్బందులు ఉన్న ఇళ్లకు వెంటనే సీసీ రోడ్లు వేయాలని ఎమ్మెల్యేను కోరిన వెంటనే నిధులు మంజూరు చేసి సీసీ రోడ్డు పనులు ప్రారంభించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, బంటు వేణుగో పాల్, తాండ్ర రాకేష్, బంటు వెంకట్, బంటు హన్మంతు, రాజు, వడ్డె శ్రీను, బి. నర్సింలు, పంచాయతీరాజ్ సిబ్బంది బలరాం తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

