గంజాయి మియా..!
– 25 ఏండ్లుగా స్మో’కింగ్’
– పోలీసుల దాడులతో గుట్టు రట్టు
– కేసు నమోదు, రిమాండుకు తరలింపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అతని వయస్సు 52 సంవత్సరాలు. 25 ఏండ్లుగా గంజాయికి బానిస అయ్యాడు. పల్లెటూరుకు చెందిన మహమ్మద్ మియా గుట్టు ఎక్సైజ్ పోలీసుల దాడులతో రట్టు అయ్యింది. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. బుధవారం తాండూరు ఎక్సైజ్ ఇంచార్జ్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

పెద్దేముల్ మండలం తట్టెపల్లికి చెందిన మహమ్మద్ మియా(52) గంజాయిని కొని తెచ్చి సేవిస్తున్నాడు. సమాచారం అందుకున్న తాండూరు ఎక్సైజ్ పోలీసులు, డీటీఎఫ్ వికారాబాద్ బృందం తనిఖీలు నిర్వహించి నిందితుడి ఇంట్లో 125 గ్రాముల ఎండు గంజాయిని గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా గంజాయిని కలిగి ఉన్నందుకు నిందితుడు మియాపై కేసు నమోదు చేసి, రిమాండుకు తరలించినట్లు ఇంచార్జ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఇట్టి తనిఖీలలో ఎస్ఐలు అదిశేషు రెడ్డి, నిజాముద్దీన్, సిబ్బంది. భీమయ్య, రవికిషోర్, రవికిరణ్. కుమార్, విస్లు, శివప్రసాద్, హన్మంతు, ఆసీఫా భేగం, రాధిక, మహేందర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
అయితే మహమ్మద్ మియా బీదర్ ప్రాంతం నుంచి గంజాయి తెచ్చుకుంటున్నట్లు విచారణలో తెలిసింది. 25 ఏండ్లుగా అతను గంజాయి తెచ్చుకుని ఇంటి పరిసర ప్రాంతాల్లో దాచుకుంటున్నట్లు గుర్తించారు. అయితే ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం.. నిబంధనలకు విరుద్దంగా గంజాయిని కలిగి ఉన్నందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో గుట్టు రట్టు అయిన మహమ్మద్ మియా కటకటాలపాలయ్యాడు.

ఇదికూడా చదవండి…

