రైతుల‌ను ద‌గా చేస్తున్న కేంద్ర స‌ర్కారు

తాండూరు రాజకీయం వికారాబాద్

రైతుల‌ను ద‌గా చేస్తున్న కేంద్ర స‌ర్కారు
– ఓర్వ‌లేక రాష్ట్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు
– తెలంగాణ రాష్ట్ర రైతుల‌కు అండ‌గా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం
– ధాన్యం కోనుగోలు చేసేదాక ఉద్య‌మం
– ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
– తాండూరులో రైతు మ‌హాద‌ర్నా
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: రైతుల ప‌ట్ల ద్వంద వైఖ‌రిని ప్ర‌ద‌ర్శిస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం నిలువునా ద‌గా చేస్తుంద‌ని ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు అన్నారు. యాసంగిలో వ‌రి ధాన్యం కొనుగోళ్ల‌పై కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని నిర‌సిస్తూ టీఆర్ఎస్ ప్ర‌భుత్వం, సీఎం కేసీఆర్, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల పిలుపు మేర‌కు తాండూరులో రైతు మ‌హాద‌ర్నా నిర్వ‌హించారు.
శుక్ర‌వారం తాండూరు ప‌ట్ట‌ణంలోని ఇందిరా చౌర‌స్తా వ‌ద్ద నిర్వ‌హించిన రైతు మ‌హాద‌ర్నాకు ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిల‌తో పాటు టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మ‌న్ ప‌ర్యాద కృష్ణ‌మూర్తిలు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిలు మాట్లాడుతూ రైతుల ప‌ట్ల కేంద్రం మోస‌పూరిత విధానాల‌కు
పాల్ప‌డుతోంద‌న్నారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వంపై భారం మోపుతు ప‌క్క‌కు త‌ప్పుకుంటుంద‌న్నారు. రైతు వ్య‌తిరేక చ‌ట్టాల‌తో పాటు అనేక విధాలుగా కేంద్రం రైతుల న‌డ్డి విరుస్తోంద‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల‌కు అండ‌గా నిలుస్తోంద‌ని అన్నారు. రైతుల కోసం టీఆర్ఎస్ ప్ర‌భుత్వం రైతు బంధు, రైతుభీమా వంటి ఎన్నో ప‌థ‌కాల‌ను ప్రవేశ పెట్టింద‌న్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన టీఆర్ఎస్ ప్ర‌భుత్వం రైతు కోసం
ఉద్య‌మిస్తుంద‌న్నారు. టీఆర్ఎస్ అంటే రైతు పార్టీగా నిలుస్తుంద‌ని అన్నారు. రాష్ట్రంలోని బీజేపీ నాయ‌కుల‌కు ఇక్క‌డి రైతుల‌పై చిత్త శుద్దిలేద‌ని విమ‌ర్శించారు. కేంద్రం మెడ‌లు వ‌చ్చి ధాన్యం కొనుగోలు చేయాల‌ని కోరాల్సిన బాధ్య‌త బీజేపి నాయ‌కుల‌పై ఉంద‌న్నారు. అలాంటిది వాటిని ప‌క్క‌న పెట్టి తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల‌కు చేస్తున్న సంక్షేమాన్ని చూసి ఓర్వ‌లేక స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేస్తుంద‌ని మండిప‌డ్డారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేసేంత‌వరకు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం రైతుల‌కు మ‌ద్ద‌తుగా అలుపెరగని పోరాటం చేస్తుంద‌ని పేర్కొన్నారు.

దిష్టి బొమ్మ‌లు, శ‌వ‌యాత్ర‌ల‌తో రైతుల నిర‌స‌న
తాండూరులో చేప‌ట్టిన రైతు ద‌ర్నాలో రైతులు వినూత్నంగా నిర‌స‌నలు చేప‌ట్టారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పిలుపు మేర‌కు తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలోని యాలాల‌, పెద్దేముల్, బ‌షీరాబాద్‌, తాండూరు మండ‌లాల‌తో పాటు కోట్‌ప‌ల్లి మండ‌లాల నుంచి రైతులు భారీ ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. తాండూరు, యాలాల‌, పెద్దేముల్ మండ‌లాల నుంచి రైతులు
ట్రాక్ట‌ర్ల ద్వారా కేంద్ర ప్ర‌భుత్వం నాయ‌కుల దిష్టిబొమ్మ‌ల‌ను తీసుక‌వ‌చ్చారు. బ‌షీరాబాద్ మండ‌లం నుంచి నాయ‌కులు, రైతులు శవ‌యాత్ర చేసుకుంటూ ద‌ర్నా వ‌ద్ద‌కు చేరుకున్నారు. స‌మావేశం అనంత‌రం ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిలు కేంద్ర ప్ర‌భుత్వ శ‌వ దిష్టిబొమ్మ‌ల‌ను ద‌హ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, రైతులు కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

త‌ర‌లివ‌చ్చిన నాయ‌కులు
తాండూరు ప‌ట్ట‌ణంలో జ‌రిగిన రైతు ద‌ర్నాకు టీఆర్ఎస్ నేత‌లు, రైతులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేతో పాటు జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ ముర‌ళీకృష్ణ‌గౌడ్, తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్‌, వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు, తాండూరు మార్కెట్ క‌మిటి చైర్మ‌న్ విఠ‌ల్ నాయ‌క్, వైస్ చైర్మ‌న్ వెంక‌ట్ రెడ్డి, ప‌శుగ‌ణాభివృద్ధి సంస్థ చైర్మ‌న్ గాజీపూర్ నారాయ‌ణరెడ్డి, ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ డైరె క్ట‌ర్ ర‌వీంద‌ర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మ‌న్లు వెంక‌ట్రామ్ రెడ్డి, ద్యావ‌రి విష్ణువ‌ర్ద‌న్ రెడ్డి, యాలాల ఎంపీపీ బాలేశ్వ‌ర్ గుప్త‌, టీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కులు క‌ర‌ణం పురుషోత్తంరావు, మాజీ చైర్మ‌న్ విశ్వ‌నాథ్ గౌడ్, టీఆర్ఎస్ సీనీయ‌ర్ నాయ‌కులు డాక్ట‌ర్ సంప‌త్ కుమార్, రాజుగౌడ్, ప‌ట్లోళ్ల న‌ర్సింలు, శ్రీ‌నివాస్ చారి, టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అఫ్పూ(న‌యూం), మాజీ అధ్య‌క్షులు అబ్దుల్ ర‌వూఫ్‌, తాండూరు మండ‌ల పార్టీ అధ్య‌క్షులు రాందాస్, పెద్దేముల్ అధ్య‌క్షులు కె.శ్రీ‌నివాస్ యాద‌వ్, బ‌షీరాబాద్ మండ‌ల అధ్య‌క్షులు రాములు నాయ‌క్, యాలాల మండ‌ల అధ్య‌క్షులు మ‌ల్లారెడ్డి, తాండూరు మున్సిప‌ల్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడ‌ర్ శోభారాణి, కౌన్సిల‌ర్లు అబ్దుల్ ర‌జాక్, మంకాల రాఘ‌వేంద‌ర్, రాము, నాయ‌కులు అబ్దుల్ స‌లీం, యువ‌నాయ‌కులు చంటియాద‌వ్, సంతోష్ గౌడ్, సంజీవ‌రావు, రాజన్ గౌడ్, ఇంతియాజ్, మోయిజ్, రియాజ్, వివిధ ప్రాంతాల ప్ర‌జా ప్ర‌తినిధులు, టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, రైతులు ద‌ర్నాలో పాల్గొన్నారు.