నమో సంగమేశ్వర స్వామి..!
– ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన శివుడు
తాండూరు, దర్శని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వరాలయంలో వెలసిన శివున్ని భక్తులు నమో సంగమేశ్వర స్వామి అంటూ వేడుకున్నారు. కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా ఆలయ పూజారి విజయ్ కుమార్ స్వామి ఆలయంలో వెలసిన శివున్ని కర్ణాటక రాష్ట్రం కూడాల గ్రామంలో వెలసిన శ్రీ సంగమేశ్వర స్వామిగా ప్రత్యేక అలంకరణ చేశారు. శివునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన శివున్ని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కార్తీక శోభ సంతరించుకుంది. ఆలయానికి వచ్చిన శివున్ని భక్తులు నమో సంగమేశ్వర స్వామి అంటూ దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

