ఆనందం నింపిన మార్వాడి యువ మంచ్

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

ఆనందం నింపిన మార్వాడి యువ మంచ్
– సంగెం కలాన్, చెస్ గోష్ పూర్లో స్వీట్ల పంపిణీ
– అభినందించిన సంగెంకలాన్ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : దీపావళికి ముందు తాండూరు మార్వాడి యువ మంచ్ సభ్యులు గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఆనంద పరిచారు. శనివారం ఆనంద్ సబ్ కే లియే కార్యక్రమంలో భాగంగా మార్వాడి యువ మంచ్ సభ్యులు తాండూరు మండలం సంగెంకలాన్, చెన్ గేష్ పూర్ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 350 మంది విద్యార్థులకు స్వీటు, బాక్సులు పంపిణీ చేశారు. సంగెం కలాన్ గ్రామంలో పాల్గొన్న సర్పంచ్ మేఘ నాథ్ గౌడ్ మార్వడి యువమంచ్ సేవలు అభినందనీయమని కొనియాడారు. పండగ ముందు విద్యార్థులకు దీపావళి కానుకలు అందించి వారి జీవితాలలో ఆనందాన్ని నింపడం సంతోషకరమన్నారు. మరోవైపు మంచ్ సభ్యులు పంపిణీ చేసిన స్వీటు, బాక్సులతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్వాడి యువమంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా, జాతీయ కన్వీనర్ కుంజ్ బిహారి సోని, తాండూరు అధ్యక్షులు బ్రిజ్ మొహన్ బూబ్, కార్యదర్శి కిషన్ గోపాల్ రాఠి, కోశాధికారి అరుణ్ సార్డా, సన్ని అగ్రవాల్, లక్ష్మీనారాయణ బూబ్, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.