భూకైలాస్లో కార్తీక శోభ..!
– శివునికి అభిషేకాలు చేసిన భక్తులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలోని ప్రసిద్ద భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగాల దేవస్థానంలో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా ఆలయానికి భక్తులు పొటెత్తారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి వల్ల ఆలయానికి భక్తులు రాలేకపోయారు. ప్రస్తుతం కరోనా
తగ్గిపోవడంతో సోమవారం ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేకువజామున స్నానమాచరించిన భక్తులు ఆలయానికి వచ్చి శివున్ని దర్శించుకున్నారు. ఆలయంలో వేధపండితుల సమక్షంలో భక్తులు శివునికి అభిషేకాలు నిర్వహించారు. భక్తుల అభిషేకాలతో శివలింగం తడిసి ముద్దయ్యింది. సాయంత్రం వేళ ఆలయానికి వచ్చిన భక్తులు కార్తీక దీపాలను వెలగించి మొక్కులు తీర్చుకున్నారు.

