ఎయిర్ టెల్ షోరూం ప్రారంభించిన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎయిర్ టెల్ షోరూం, పవన్ ఎంటర్ ప్రైజెస్ షోరూంను తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ స్వప్న పరిమళ్ ప్రారంభించారు. బుధవారం పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన షోరూం ప్రారంభోత్సవానికి చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వ్యాపార నిర్వహకులు, కౌన్సిలర్లతో కలిసి చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ షోరూంను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తాండూరు పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. నూతనంగా ప్రారంభించిన ఎయిర్ టెల్ షోరూం మంచి లాభాలలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అబ్దుల్ రజాక్, వెంకన్న గౌడ్, ముక్తార్ నాజ్, బోయ రవికుమార్ నిర్వాహకులు ప్రొఫెటర్ వేముల సురేంద్ర నాథ్ తదితరులు పాల్గొన్నారు.


