వినాయక.. సెలవికా..!!

తాండూరు రాజకీయం వికారాబాద్


వినాయక.. సెలవికా..!!

– నిమజ్జనంకు తరలిన గణనాథులు
– స్వాగతించిన చీఫ్ విప్, ఎమ్మెల్యే, సమితి సభ్యులు
– బందోబస్తు నిర్వహించిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయకా సెలవికా.. అంటూ అంటూ తాండూరు భక్తులు గణనాథులను వీడ్కోలు పలికారు. ఐదు రోజులు మండపాల్లో ప్రతిష్టించి వినాయకులను ఆదివారం నిమజ్జనానికి తరలించారు. నిమజ్జన ఉత్సవాలు అంగరంగా వైభవంగా కొనసాగాయి.
kvcs
భద్రేశ్వర చౌరస్తా మీదుగా గణేషుల శోభాయాత్ర కోలాహలంగా కొనసాగుతోంది. యువత కేరింతలతో.. నృత్యాలతో గణనాథునికి సెలవు పలికారు. మద్యాహ్నం నుంచి మొదలైంది. తాండూరు పట్టణంలో జరిగిన వినాయక నిమజ్జన వేడుకలలో చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు పాల్పంచుకున్నారు. స్థానిక భద్రేశ్వర్ చౌక్ వద్ద హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిమజ్జన ఊరేగింపు వినాయకులకు స్వాగతం పలింకారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, కరణం పురుషోత్తంరావు, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి. నాయకులు డా. సంపత్ కుమార్, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిమజ్జనానికి తరలివెళ్లే ప్రతి వినాయకునికి తాండూరు హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఘనంగా వీడ్కోలు పలికారు. మున్సిపల్ పరిధి పాత తాండూరు కోట సమీపంలో, పట్టణంలోని భద్రేశ్వర చౌరస్తాలో స్టేజీలు వేసి వినాయకులకు స్వాగతం పలికారు. మరోవైపు నిమజ్జనం సందర్బంగా వికారాబాద్‌ జిల్లా ఎస్సీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఇదికూడా చదవండి…

తాండూరులో కొత్త కాలనీ..!