పొలంలో పేకాట..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

పొలంలో పేకాట..!
– కరణ్‌ కోట్ పోలీస్టేషన్‌లో 11 మందిపై కేసు
– కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్ఐ విఠల్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పొలంలో పేకాట ఆడుతూ 11 మంది పట్టుబడ్డారు. తాండూరు మండలం కరణ్ కోట్ పోలీస్టేషన్‌లో నిందితులపై కేసు నమోదయ్యింది. ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలోని ఘనాపురం నారాయణ పొలంలో కొందరు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కొత్త తుల్జప్ప, నందిగామ అమృతయ్య, అల్లాకోడ్ పండరి, నాగారం లక్ష్మప్ప, జెట్టూరు గోవింద్, ఈడిగి తుల్జారాం గౌడ్, మంగలి రాజు, దండుగల్ల గైబప్ప, నర్సింలులను అదుపులోకి తీసుకున్నారు.

వారి వాద్ద నుంచి రెండు సెట్ల పేకాట ముక్కలతో పాటు రూ.8900లను స్వాదీనం చేసుకున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. దీంతో వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అంతకుముందు ఎస్ఐ విఠల్ రెడ్డి పేకాట ఆడుతూ పట్టుబడిన వ్యక్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పేకాట జూదానికి బానిసలు కావద్దని, దీనికి అలవాటు పడితే కుటుంబాలు రోడ్డు పాలు అవుతాయని, జూదానికి దూరంగా ఉండాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

మహిళలు ఆర్థిక రంగంలో దూసుకపోవాలి