ఎస్కేటీఎస్లో బతుకమ్మ సంబరాలు అదుర్స్..!
– ఆడిపాడిన విద్యార్థులు, టీచర్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ రోడ్డు మార్గంలోని శ్రీ కృష్ణవేణీ టాలెంట్స్కూల్(ఎస్కేటీఎస్)లో బతుకమ్మ వైభోగం సంతరించుకుంది. శనివారం స్కూల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సహాంగా బతుకమ్మ పండగను జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మను అందమైన పూలతో అలంకరించి.. సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించారు.

బతుకమ్మ.. బతుకమ్మా.. ఉయ్యాలో… చిత్తు చిత్తూల బొమ్మా.. అంటూ పాటలతో మహిళలు, చిన్నారులు ఆడిపాడారు. ఈ కార్యక్రమానికి స్కూల్ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, కరస్పాండెంట్ పట్లోళ్ల సర్వోత్తమ్ రెడ్డి, డైరెక్టర్ జయవర్దన్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంప్రదాయానికి బతుకమ్మ పండగ ప్రతీకగా నిలుస్తోందన్నారు. బతుకమ్మ సంప్రదాయాలతో పాటు ఆడ పడచుల ఆత్మగౌరవాన్ని చాటుతుందన్నారు.

అదేవిధంగా ఎస్కేటీఎస్ విద్యార్థులకు ఉత్తమ విద్యనందించడంతో పాటు సంప్రదాయాలపై అవగాహన పెంచేందుకు కృసి చేస్తుందన్నారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలుత తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నిజామాబాద్ రమేష్, ఉపాధ్యాయులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, సునిత, అనిల్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

