సల్లంగా చూడూ దుర్గామాత..!
– అమ్మవారిని దర్శించుకున్న విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్దలతో జరుగుతున్నాయి. పట్టణంలో వివిధ ప్రాంతాల్లోని మండపాల్లో ప్రతిష్టించిన అమ్మవారిని పూజలు నిర్వహిస్తున్నారు.

శుక్రవారం తాండూరు పట్టణం బసవణ్ణ కట్ట వద్ద ప్రతిష్టించిన దుర్గామాతను తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్, కూతురు ప్రశాంతి, అల్లుడు సురేష్ నాయక్ లతో కలిసి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులలో అందరికి మంచే జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటి సభ్యులు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

