తాండూరు విద్యార్థికి గ్రూప్-1 జాబ్

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు విద్యార్థికి గ్రూప్-1 జాబ్
– ఎంపీడీఓగా ఉద్యోగం పొందిన కురువ క్రాంతి
– సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ప్రతం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన విద్యార్థి కురువ క్రాంతి గ్రూప్ -1 జాబ్ పొందాడు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎంపీడీఓ అధికారిగా నియామకపత్రం అందుకున్నారు.

తాండూరులోని ప్రముఖ న్యాయవాది కురువ గోపాల్, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కురువ బాలమణిల కుమారుడు కురువ క్రాంతి సివిల్ సర్వీసులో ఉద్యోగమే లక్ష్యంగా ముందుకు సాగాడు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-1, 2 పరీక్షలు రాశాడు. ఈ రెండు విభాగాలలో ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. తాజాగా గ్రూప్-1 విభాగంలో ఎంపీడీఓ ఉద్యోగానికి నియామకం అయ్యారు.
kvcs
హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉద్యోగ నియామకపత్రంను అందుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు గోపాల్, బాలమణిలు సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా తాండూరు ప్రాంతానికి చెందిన విద్యార్థి క్రాంతి గ్రూప్-1 నుంచి ఎంపీడీఓగా ఉద్యోగం సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

ఇదికూడా చదవండి….

నైపుణ్య వేదికలు ఏటీసీలు..!