బుయ్యని వారి పెండ్లి పిలుపు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బుయ్యని వారి పెండ్లి పిలుపు..!
– మంత్రులను కలిసి ఆహ్వానించిన బీఎస్ఆర్ దంపతులు
– అతిరథ మహారథులకు కూడా ఆహ్వానం

తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన వ్యాపార వేత్త, ఆర్బీఓఎల్ సీఈఓ, కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి వారి ఇంట్లో జరిగే వివాహా మహోత్సవం సందర్బంగా ఆహ్వాన పిలుపులతో సందడి ఏర్పడింది.

బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, సరళారెడ్డి దంపతుల కుమారుడు బ్రిజేష్‌ రెడ్డి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డి, సరళా రెడ్డి దంపతులు అథిరథ మహారథులను ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి స్వయంగా ఆహ్వానిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నేతలను కూడా పిలుస్తున్నారు.
kvcs
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, సరళా రెడ్డి దంపతులు కలిసి స్వయంగా శుభలేఖను అందించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ రావును కూడా ఆహ్వానించారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునంధన్ రావును కలిసి కుమారుడి వివాహానికి రావాలని కోరారు. వారితో పాటు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మరియు ఆప్త మిత్రులను కూడా ఆహ్వనించారు.

ఇదికూడా చదవండి….

దాల్చిన చెక్కనా.. మజాకా..!