పట్టణాభివృద్ధిపై దృష్టి సారించండి
– ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వేగవంతం చేయాలి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణ అభివృద్ధి, సుందరీకరణపై దృష్టిసారించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమీషనర్ యాదగిరి, పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

పట్టణంలో అభివృద్ధి పనులు, ఇందిరమ్మ నిర్మాణాలపై ఆరా తీశారు. అదేవిధంగా పట్టణంలో పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు, మురుగు కాలువల నిర్మాణ వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. వార్డు అధికారుల పనితీరునను కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు అవగాహన కల్పించి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. వార్డు ఆఫీసర్లు తప్పకుండా క్షేత్రస్థాయిలో తిరిగి సమస్యలు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకవచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ మణిపాల్, ఏఈ వినోద్, శానిటరి ఇను స్పెక్టర్లు, వర్క్ ఇను స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

