అంతారంలో ఉపసర్పంచ్ ఎన్నిక వాయిదా

తాండూరు రాజకీయం వికారాబాద్

అంతారంలో ఉపసర్పంచ్ ఎన్నిక వాయిదా
– గెలిచిన వార్డు సభ్యులకు అందని నియామకపత్రాలు
– ఎన్నికల అధికారిపై చర్యలకు డిమాండ్
– జిల్లా కలెక్టర్, తాండూరు సబ్‌ కలెక్టర్‌కు వార్డుల సభ్యుల ఫిర్యాదు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం గ్రామంలో ఉపసర్పంచు ఎన్నిక వాయిదా పడింది. ఎన్నికల్లో గెలిచిన వార్డు సభ్యులకు గెలుపు నియామకపత్రాలు అందకపోవడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల అధికారి ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేశారని వార్డు సభ్యులు ఆరోపించారు.

శుక్రవారం తాండూరు సబ్‌ కలెక్టర్ ఉమా శంకర్‌ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. తాండూరు మండలం అంతారం గ్రామంలో గురువారం ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎన్నికల అధికారిగా డి.రవికుమార్ విధుల్లో ఉన్నారు. ఓటింగ్‌ కౌంటింగ్ తరువాత కాంగ్రెస్ మద్దతుతో జంగని లక్ష్మీ విజయం సాధించారు. వార్డు సభ్యులుగా బీఆర్ఎస్ మద్దతుదారులు సుందరి నాగమణి, దౌల్తాబాద్‌ అనిత, విజయేందర్, ప్రవీణ్‌ కుమార్, వడ్డె రవి, బీజే గోరేమ్మ, శేరి విజయేందర్ రెడ్డిలు గెలిచారు.

ఎన్నికల తరువాత ఉపసర్పంచ్‌ను ఎన్నుకోవాల్సి ఉండగా ఎన్నికల అధికారి డి.రవీందర్ ఎన్నిక నిర్వహించలేదని వార్డు సభ్యులు ఆరోపించారు. బీఆర్ఎస్ తరుపున బీజే గోరెమ్మను ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల అధికారి ఇష్టారాజ్యంగా విధులు నిర్వహించారని అన్నారు. పైగా గెలిచిన వార్డు సభ్యులకు నియామకపత్రాలు కూడా అందించలేదని తెలిపారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేశారని ఆరోపించారు. ఎన్నికల అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు.

ఇదికూడా చదవండి….

మనోహర్‌ రెడ్డి కృషితో మెజార్టీ స్థానాలు