టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి

తాండూరు రాజకీయం

టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి
– పెద్దేముల్ గ్రామ కమిటి అధ్య‌క్షులుగా డీవై ప్రసాద్
పెద్దేముల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : గ్రామ‌స్థాయిలో టీఆర్ఎస్ పార్టీని బ‌లోపేతం చేసేందుకు కృషి చేస్తాన‌ని ఆ పార్టీ పెద్దేముల్ గ్రామ కమిటి అధ్య‌క్షులుగా డీవై ప్ర‌సాద్ పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం మండ‌ల పార్టీ కార్యాల‌యంలో టీఆర్ఎస్ పెద్దేముల్
మండ‌ల పార్టీ అధ్య‌క్షులు కోహీర్ శ్రీ‌నివాస్ యాద‌వ్ డీవై ప్ర‌సాద్‌ను పెద్దేముల్ గ్రామ క‌మిటి అధ్య‌క్షులుగా నియ‌మించి నియామ‌క ప‌త్రం అంద‌జేశారు. అనంత‌రం డీవై ప్ర‌సాద్ మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, తనకు అధ్యక్ష పదవిని ఇచ్చిన కోహిర్ శ్రీనివాస్ యాద‌వ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లడంతో పాటు టీఆర్ఎస్ పార్టీ బ‌లోపేతానికి త‌న‌వంతు కృషి చేస్తాన‌ని పేర్కొన్నారు. ఇందుకు అంద‌రు స‌హాకారం అందించాల‌ని అన్నారు.