బోనాల జాతరకు రండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బోనాల జాతరకు రండి..!
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఆహ్వానించిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: పట్టణం వాల్మీకి నగర్ లో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ బోనాల పండుగ సందర్భంగా దేవాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. రేపు శుక్రవారం బోనాల జాతరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సంద్భంగా వార్డ్ నెంబర్ 23 వాల్మీకి నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ సీనియర్ నాయకులు భరత్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని కలిశారు.

 

అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను అందజేస్తూ బోనాల ఉత్సవాలలో పాల్గొనాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, తాండూరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కావలి సంతోష్, కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు అంతారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

ఇదికూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం