పైలెట్ చెంతకు చేరిన సంతోష్ గౌడ్
– బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన రోహిత్ రెడ్డి
– పార్టీ వీడేందుకు కారణాలు అవేనా..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చెంతకు కాంగ్రెస్ యువనాయకులు సంతోష్ గౌడ్ చేరారు. శుక్రవారం హైదరాబాద్ లో రోహిత్ రెడ్డి నివాసంలో సంతోష్ గౌడ్ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు.

గత కొన్ని నెలల క్రితం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన సంతోష్ గౌడ్ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. తాజాగా సంతోష్ గౌడ్ రోహిత్ రెడ్డి సమక్షంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సంతోష్ గౌడ్ కు గులాబీ కండువా కప్పి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ సంతోష్ గౌడ్ తిరిగి బీఆర్ఎస్ లో చేరడంపై సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా సంతోష్ గౌడ్ మాట్లాడుతూ రోహిత్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువనాయకులు చంటి యాదవ్, సంజీవ రావు తదితరులు ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పాటు గుర్తింపు లేకపోవడంతో సంతోష్ గౌడ్ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిసింది.

ఇదికూడా చదవండి…

