బీఆర్ఎస్ పార్టీతోనే పట్టణాభివృద్ధి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్ఎస్ పార్టీతోనే పట్టణాభివృద్ధి..!
– మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
– 9వ వార్డు నుంచి కౌన్సిలర్ గా నామినేషన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీతోనే పట్టణాభివృద్ధి చెందడం ఖాయమని మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. గురువారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల సావిత్రమ్మతో కలిసి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని అన్నారు. మున్సిపల్ కార్యాలయంపై గులాబీ జెండా ఎగురవేస్తామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

మరోవైపు సాయిపూర్ ప్రాంతంలోని తమ కుటుంబం నుంచి మొదట పట్లోళ్ల నర్సింలు, తరువాత పట్లోళ్ల సావిత్రమ్మలు పోటీ చేసి ప్రజలకు సేవలందించారని గుర్తుచేశారు. మూడో సారి గతంలో తాను కౌన్సిలర్ గా గెలిచి వైస్ చైర్ పర్సన్ గా సేవలందించడం జరిగిందని, వరుసగా నాలుగోసారి తమ కుటుంబం నుంచి బరిలో నిలుస్తున్నామని అన్నారు. ప్రజల మద్దతుతో భారీ మెజార్టీని సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి…

పారదర్శకంగా ఎన్నికలు..!