విద్యుత్ షాక్తో ప్రభుత్వ టీచర్ మృతి..!
– యాలాల మండలంలో కోకట్లో విషాదం
– సంతాపం తెలిపిన పీఆర్టీయూ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యుత్ షాక్తో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృత చెందాడు. ఈసంఘటన మంగళవారం యాలాల మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కోకట్ గ్రామానికి చెందిన మహమూద్ హింధీ టీచర్ గా అదే మండలం రాస్నం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పనిచేస్తున్నారు.

అయితే కోకట్ గ్రామంలోని నివాసంలో పిండి గిర్నిలు కూడా ఉన్నాయి. మంగళవారం మహమూద్ ఇంట్లో గిర్నికి సంబంధించిన విద్యుత్ వైర్లను సరిచేస్తుండగా ప్రమాద వశాత్తు షాక్కు గురయ్యారు. గమనించిన కుటుంభీకులు చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మహమూద్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మహమూద్ మృతితో ఇంట్లో విషాదం నెలకొంది. మరోవైపు ప్రభుత్వ ఉపాధ్యాయుడు మహమూద్ మృతి పట్ల పీఆర్టీయూ నేతలు సంతాపం తెలిపారు. పీఆర్టీయూ యాలాల మండల అధ్యక్షులు సి.కృష్ణారెడ్డి, కార్యదర్శి రాములులు కుటుంబానికి సానుభూతి తెలిపారు. మహమూద్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఇదికూడా చదవండి…

