హస్తానికి ఓటు వేస్తే మళ్లీ మోస పోతాం..!
– బీఆర్ఎస్ పార్టీతోనే పట్టణ అభివృద్ధి
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– 7వ వార్డులో ఈర్షాద్ కోసం ముమ్మర ప్రచారం
– పైలెట్తో ముస్లిం సోదరుల ఆత్మీయత
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇప్పటికే ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసిన హస్తం పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసి మళ్లీ మోసపోతామని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం 7వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఈర్షాద్ తరుపున ఎన్నికల ప్రచారం జరిగింది.

ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ తో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్బంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ 7 వ వార్డు అభ్యర్థి ఇర్షాద్కు ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ మాయమాటలను నమ్మి మరోసారి మోసపోవద్దని అన్నారు. ఎన్నికల్లో ఆపార్టీకి ఓటు వేసి మళ్లీ మోసపోతామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే తాండూరు పట్టణం వార్డుల అభివృద్ధి జరగడం ఖాయన్నారు. పట్లోళ్ల నర్సింలు చైర్మన్ అయితే తాండూరు పట్టణం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందని పేర్కొన్నారు.

మరోవైపు 7వ పరిధిలోని దర్గా మజీద్, నూర్ ఉలూమ్ మదర్సా మజీద్లలో ప్రార్థనల అనంతరం రోహిత్ రెడ్డితో ముస్లిం సోదరులు ఆత్మీయతను కనబరిచారు. ఇందుకు రోహిత్ రెడ్డి వారితో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉండాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ముస్లిం సోదరులను కోరారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు విజయ్ కుమార్, స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

