మహిళలకు, బాలికలకు కేంద్రం వరం..!
– ఉచితంగా హెచ్పీవీ వ్యాక్సిన్ అభినందనీయం
– మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్
తాండూరు, దర్శిని ప్రతినిధి : గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా హెచ్పీవీ వాక్సినేషన్ అందించడం మహిళలకు, బాలికలకు వరంగా మారిందని తాండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ అన్నారు.

కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో శనివారం తెలుగు రాష్ట్రాల్లో హెచ్పీవీ వాక్సీనేషన్ ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా సాహు శ్రీలత హర్షం వ్యక్తం చేస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉచిత హెచ్పీవీ వ్యాక్సిన్ అందించడం అభినందనీయమని అన్నారు. మహిళలు గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వాక్సీనేషన్ అందిస్తుందని తెలిపారు. అయితే 14 -15సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క అమ్మాయికి కేంద్రం ఈ వ్యాక్సిన్ ఉచితంగా వేయించుకోవచ్చని తెలిపారు. ప్రాథమిక ఆసుపత్రిలో, ఆశ వర్కర్లను సంప్రదించి వాక్సీనేషన్ వేయించుకోవాలని సూచించారు. మహిళలకు, బాలికల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రధాని మోడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


