స్కూల్లో పేకాట..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

స్కూల్లో పేకాట..!
– అడ్డంగా దొరికిన జూదరులు
– తాండూరు పోలీస్టేషన్లో కేసు
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్కూల్ ఆవరణలో పేకాట ఆడుతూ 6మంది పేకాట రాయుళ్లు పట్టుబడ్డారు.

పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్‌ పోలీసులు దాడులలో అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణంలోని మాణిక్‌నగర్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పేకాట ఆడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్ ఫోర్స్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దాడులు చేశారు.

ఈ దాడుల్లో బండి శ్యామ్, కె. చందర్, నస్కంటి నర్సింలు, అలంపల్లి రాము, బిచం రాజు, వి. తిరుపతి అనే ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా వారి వద్ద నుండి రూ. 3,050 నగదును, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. వారిని తాండూరు పట్టణ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీస్‌ స్టేషన్‌లో వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

మాజీ ఎంపీ డా. రంజిత్ రెడ్డికి బీఎస్ఆర్ పరామర్శ