డబుల్ బెడ్‌ రూం డ్రాను రద్దు చేయించండి

తాండూరు రాజకీయం వికారాబాద్

డబుల్ బెడ్‌ రూం డ్రాను రద్దు చేయించండి
– కేటాయింపు కుట్రలోని వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి
– తాండూరు ఆర్డీఓకు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కేటాయింపు కోసం ఓ ప్రైవేటు ట్రస్టు నిర్వహించిన డ్రాను రద్దు చేయించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.

సోమవారం తాండూరు ఆర్డీఓ అనితను జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, పార్టీ నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తాండూరుకు చెందిన ఏస్ జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో పేదలకు కేటాయించాల్సిన ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్లు (ఇందిరమ్మ ఇళ్లు అంటూ) డ్రా తీసి పలువురికి కేటాయింపులు చేశారని ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు.

ఇందులో అధికార యంత్రాంగం ఎవరు కూడా పాల్గొనలేదని తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ఎమ్మెల్యే సోదరుడు శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొని ప్రోత్సహించారని ఆరోపించారు. చారిటబుల్ ట్రస్ట్ సంబంధించిన వ్యక్తులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇళ్లు కేటాయించేలా డ్రాలు తీశారని అన్నారు. దీని వల్ల అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌ రూం ఇళ్లు దక్కే పరిస్థితి లేకుండా పొయిందని ఆవేధన వ్యక్తం చేశారు.

కావున అనధికారికంగా నిర్వహించిన డ్రా ను రద్దు చేయించాలని కోరారు. అదేవిధంగా ఈ కుట్రలో ఉన్న వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకే సామాజిక వర్గానికి కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో నిజమైన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, ప్రిన్సిపాల్ సెక్రటరీ దృష్టికి కూడా తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్కుల నరేందర్ గౌడ్‌లు ఉన్నారు.

ఉద్రిక్తంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ అరెస్టు