రైతులను ఆదుకుంటాం..!
– తడిసిన ధాన్యం కొనుగోలుకు సిద్దం
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి రైతుల సమస్యలు
– వీడియో కాన్ఫరెన్స్లో వివరించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు.

ఆదివారం పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. తాండూరు నియోజకవర్గంలోని ధాన్యం రైతుల ఇబ్బందులు, సమస్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ రైతులు ఆందోళన చెందల్సిన అవసరం లేదని, తడిసిన ధాన్యం కూడ కొంటాం అని హామి ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

అదేవిధంగా అధికారులు, రైతులు, మిల్లర్ల సమన్వయంతో కొనుగోలు చేసేందుకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరంలో రూ.45 వేల కోట్లు వరి ధాన్యం కొనుగోలు ద్వారా రైతులకు అందించడం జరిగిందన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో డబ్బులు జమచేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రైతులు ఆందోళన చెందొద్దని భరోసా అందించారు.


