ట్రేటా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మృత్యుంజయస్వామి హీరేమఠ్‌

తాండూరు రాజకీయం వికారాబాద్

ట్రేటా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మృత్యుంజయస్వామి హీరేమఠ్‌
– తాండూరు వాసి ఎన్నిక పట్ల పలువురు హర్షం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ అండ్ టీచర్స్ అసోసియేషన్‌(ట్రేటా) రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తాండూరు నియోజకవర్గంకు చెందిన మృత్యుంజయ స్వామి హీరేమఠ్ ఎన్నికయ్యారు.

శనివారం హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో ట్రేటా సర్వసభ్య సమావేశంలో ద్వివార్షిక ఎన్నికలు నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రేటా రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏక్రగీవంగా ఎన్నుకున్నారు.

రాష్ట్ర కార్యవర్గంలో తాండూరుకు చెందిన మృత్యుంజయ స్వామి హీరేమఠ్‌కు రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పిస్తూ ట్రేటా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఆయన ఎన్నిక పట్ల తాండూరు అసోసియేషన్ అధ్యక్షులు బిబ్బెళ్ళి గౌరీ శంకర్, కార్యదర్శి గాజుల బస్వరాజు, రాష్ట్ర బాధ్యులు ముద్ద మల్లేశంతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు.

రాజస్థాని మహిళ మండలి మానవత్వం