రాజస్థాని మహిళ మండలి మానవత్వం
– జిల్లా ఆసుపత్రిలో మహిళల రక్తదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని రాజస్థాని మహిళ మండలి సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు.

ఆదివారం ప్రపంచ రక్తదాన దినోత్సవంను పురస్కరించుకుని రాజస్థానీ మహిళ మండలి ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం నిర్వహించారు. పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి రక్త నిధి కేంద్రంలో 12 మంది మహిళా మండలి సభ్యులు రక్త దానం చేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహిళలు రక్తదానం చేసేందుకు ముందుకు రాడం గొప్ప విషయం అని కొనియాడారు. మహిళలు ఇంటి పనులతో పాటు సమాజ సేవ లో కూడా ముందుంటారని అన్నారు. మానవ సేవ యే మాధవ సేవా అని యువతులు కూడా ముందుకు వచ్చి రక్త దానం చేయడం అభినందనీయమని అన్నారు.

ఇందులో మొట్ట మొదటి సారి శృతి అనే 22 ఏళ్ల యువతి రక్తదానం చేసినట్లు మండలి అధ్యక్షురాలు కిరణ్ సార్డా తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళ మండలి కార్యదర్శి వర్షా సార్డా, సభ్యులు రీతూ సోనీ, సీమా సార్డా, నిఖిత బూబ్, దీపా బూబ్, మంచ్ సభ్యులు మన్మోహన్ సార్డా, కరణ్ జైన్, భరత్ దేవ్డా, రమాకాంత్ పండిట్, అనిల్ సార్డా, దినేశ్ పర్తాని, అభిషేక్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.


