టీపీసీ కార్యవర్గంలో ధారాసింగ్‌కు చోటు..!
– ప్రధాన కార్యదర్శిగా రెండోసారి చాన్స్
– ఉత్తర్వులు జారీ చేసిన అధిష్టానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) కొత్త కార్యవర్గంలో తాండూరు నియోజకవర్గంకు చెందిన సీనీయర్ నేత, పెద్దేముల్ మాజీ జెడ్పీటీసీ ధారాసింగ్‌కు మరోసారి చోటు దక్కింది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయనకు మరోసారి అదే పదవిలో అవకాశం కల్పించారు.

మంత్రివర్గ విస్తరణలో మాదిరి పీసీసీలోనూ బడుగువర్గాల వారికి ప్రాధాన్యమిచ్చారు. పదవుల భర్తీలో విధేయత, సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యం దక్కింది. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్నవారి వివరాలను జిల్లాలవారీగా సేకరించి ఈ పదవులకు ఎంపికచేశారు. పార్టీ కోసం ధారాసింగ్ అందిస్తున్న సేవలను గుర్తించి మరోసారి టీపీసీసీ కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా ధారాసింగ్ మాట్లాడుతూ అధిష్టానం తనకు రెండోసారి టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన ధారాసింగ్‌కు తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

