గుండెపోటుతో పరశురాం మేస్త్రి కన్నుమూత

తాండూరు రాజకీయం వికారాబాద్

గుండెపోటుతో పరశురాం మేస్త్రి కన్నుమూత
– రాజకీయ పార్టీలలో పనిచేసిన నేతగా గుర్తింపు
– స్వగ్రామం అంతారంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంతానికి చెందిన వడ్డె పరుశురాం మే ్రస్తీ గుండెపోటులో కన్నుమూశారు.

పట్టణంలోని గొల్ల చెరువుకు చెందిన పరుశురాం పలు రాజకీయ పార్టీలలో పనిచేశారు. వైఎస్‌ జగన్ స్థాపించిన వైఎస్‌ఆర్‌సీపీ పార్టీలో తాండూరులో కీలకంగా పనిచేశారు. ఆ తరవాత తెలంగాణ ఏర్పాటు తరువాత మాజీ మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌ పార్టీలో చేరారు.

గత మున్సిపల్ ఎన్నికల అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే పలు కాంట్రాక్ట్‌ పనులు నిర్వహించే వారు. ప్రస్తుతం తాండూర్ పట్టణంలోని పోట్లీ మహారాజ్ టెంపుల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. పరశురాం మేస్త్రి అందరితో కలిసి మెలిసి ఉంటూ కులమతాలకు అతీతంగా అందరితో కలిసి మెలిసి ఉండేవారు. ప్రతి ఒక్కరిని ఆపాయంగా పలకరించే పరుశురాం మృతి చెందడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేశారు.

వారి కుటుంబం మొత్తం రాజకీయంగా మంచి పేరున కుటుంబంగా పేరు ఉంది. పరశురామ్ సోదరుడు వడ్డె శ్రీనివాస్ ఏఎంసీ చైర్మన్‌గా పనిచేశారు. అన్న నర్సింలు మేస్త్రి మున్సిపల్ కౌన్సిలర్ గా పని చేశారు. అన్న కుమారుడు మన్నపురం రాము ప్రస్తుతం మున్సిపల్ కౌన్సిలర్ గా కొనసాగుతున్నారు. అయితే పరుశురాం అంత్యక్రియలను ఆయన స్వగ్రామం తాండూరు మండలం అంతారం గ్రామంలో మధ్యాహ్నం 3గంటలకు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఏండ్లుగా.. పాగా..!