మళ్లీ కరోనా సంజా..!

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

మళ్లీ కరోనా పంజా..!
– తాండూరులో 22, పెద్దేముల్ 4 కేసులు న‌మోదు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు నియోజకవర్గంలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. రోజు రోజుకూ తాండూరు ప్రాంతంలో కరోనా సులు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రతిచోటా కరోనా థర్డ్వేవ్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. గత రెండు, మూడు రోజులుగా పాజిటివ్ వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం తాండూరులో 9 కేసులు నమోదు కాగ గురువారం 22 కేసులు నమోదయ్యాయి. బుధవారం దాదాపు 60 మంది పరీక్షలు నిర్వహించగా 9 కేసులు నమోదయ్యాయి. గురువారం 99 మందికి పరీక్షలు నిర్వహిస్తే 22 కేసులు నమోదయ్యాయి. ఈ మధ్య కాలంలో ఇన్ని కేసులు నమోదు కావడం రికార్డు అని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి పీపీ యూనిట్ ఇంచార్జ్ డాక్టర్ బాస్కర్ తెలిపారు. మరోవైపు తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్ మండలంలో గురువారం నాలుగు పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు తెలిపారు. గత కొంత కాలంగా కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా కరోనా, కొత్త వేరియంట్ ఓమిక్రాన్‌తో తాండూరులో మళ్లీ కరోనా సంజా విసురుతోంది. ఇదిలా ఉండగా వైద్యులు, పోలీసులు ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మాస్కులు ధరించి.. భౌతికదూరం పాటించాలని సూచిస్తున్నారు. కట్టడి చర్యలతోనే కరోనాను నియంత్రించవచ్చని పేర్కొంటున్నారు.