అభివృద్ధి పనులను వేగవంతం చేయండి

తాండూరు రాజకీయం వికారాబాద్

అభివృద్ధి పనులను వేగవంతం చేయండి
– మౌళిక సదుపాయాలతో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను సిద్దం చేయండి
– తాండూరులో వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి పర్యటన
– గిరిజన, మైనార్టీ బాలికల వసతి గృహం సందర్శన
– విద్యార్థినిలకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు మున్సిపల్‌లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు.

గురువారం కలెక్టర్ దీపక్ తివారం తాండూరు మున్సిపల్‌లో పర్యటించారు. మున్సిపల్‌కు సంబంధించిన డంపింగ్‌ను సందర్శించారు. చెత్త సేకరణను పరిశీలించారు. అక్కడి నుంచి అమృత్‌ 2.0 కింద నిర్మిస్తున్న మిషన్ భగీరథ ట్యాంకుల నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు ఏ దశలో ఉన్నాయని, ఎప్పుడు పూర్తి చేస్తారనే విషయాలను ఆరా తీశారు. అనంతరం పట్టణంలోని శాంతినగర్‌ను పార్కును సందర్శించారు.

పార్కులో పచ్చదనం పెంపు, అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. దీంతో పాటు హైదరాబాద్‌ రోడ్డు మార్గంలో ఉన్న డబుల్ బెడ్‌ రూం ఇళ్లను పరిశీలించారు. పంపీణికి ముస్తాబైన ఇళ్లను సమీక్షించారు. ఇక్కడ అన్ని మౌళిక సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. మౌళిక సదుపాయాలు కల్పించి పంపిణీకి సిద్దం చేయాలని సూచించారు. పట్టణంలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.

మరోవైపు తాండూరు పట్టణంలోని గిరిజన, మైనార్టీ బాలికల సంక్షేమ వసతి గృహాన్ని కలెక్టర్ దీపక్ తివారి సందర్శించారు. వసతి గృహాలలో వంట గది, నిత్యావసర సరుకుల నిల్వ గదిని పరిశీలించారు. విద్యార్థినిలకు ఎలాంటి భొజన మెను పాటిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. వంటకాల కోసం ఉపయోగించే వస్తువుల గడువు తేదీలను పరిశీలించారు. తేది పూర్తయిన సరుకులను వాడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా శ్రద్ద తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి, హౌసింగ్ డిఈ మహమ్మద్ ఖలీముద్దీన్ సంబంధిత అధికారులు ఉన్నారు.

మొక్కలతోనే మనుగడ