భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ
– తాండూరులో ఘనంగా జన్మదినం వేడుకలు
– క్యాంపు కార్యాలయంలో నేతలు, కార్యకర్తల సందడి
తాండూరు, దర్శిని ప్రతినిధి: లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రానున్న రోజుల్లో భావి భారత ప్రధాని అవుతారని తాండూరు కాంగ్రెస్ నేతలు అన్నారు.

శుక్రవారం తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ భవన్లో పార్టీ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రాహుల్ గాంధీ జన్మదిన అన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సిములు, కాంగ్రేస్ సీనియర్ నాయకులు, నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ భావి భారత ప్రధాని రాహుల్ గాంధే అని, కచ్చితంగా దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ప్రజాస్వామిక పాలన వైపు దేశం అడుగులు వేయాలంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చెయ్యాలని దేశ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్, చెనిమిళ్ల మల్లికార్జున్, పి బస్వరాజ్, మాజీ వైస్ చైర్మన్ అలీం, మాజీ కౌన్సిలర్లు లింగదల్లి రవి కుమార్, ప్రభాకర్ గౌడ్, వెంకట్ రాం నాయక్, డీసీసీ కార్యదర్శి కావలి సంతోష్, అధికార ప్రతినిధి గోపాల్, కోర్వార్ నగేష్, ముస్తఫా పటేల్, గూళి పరమేశ్వర్, ఉర్దూ ఘర్ చైర్మన్ జలాల్, వడ్డే శ్రీనివాస్,దొరశెట్టి సత్యమూర్తి, యాసీన్, ఆంజనేయులు, ఆనంద్, మడపతి శివ కుమార్, ప్రహ్లాద్, భరత్ రెడ్డి, అంతారం శ్రీనివాస్, నారా అశోక్, రాజు, అఖిల్ బాబా తదితరులు పాల్గొన్నారు.


