ఆ మార్గంలో రాక‌పోక‌లు బంద్‌..

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

ఆ మార్గంలో రాక‌పోక‌లు బంద్‌
– మ‌ళ్లీ తెగిన మ‌న్‌సాన్‌ప‌ల్లి వాగు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: జిల్లా కురిసిన భారీ వ‌ర్షాల‌కు తాండూరు నియోజ‌క‌ర్గంలోని వాగులు, వంక‌లు ఉప్పొంగుతున్నాయి. ప్ర‌యాణా మార్గాల్లో పారుతున్న వాగుల‌ను దాటేందుకు ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. నియోజ‌క‌ర్గంలోని పెద్దేమ‌ల్ మండ‌లం మ‌న్‌సాన్‌ప‌ల్లి వాగు మ‌ళ్లీ తెగిపోయింది. దీంతో తాండూరు మీదుగా హైద‌రాబాద్ వెళ్లే వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. హైద‌రాబాద్ వెళ్లే వారు.. వ‌చ్చే వారు అక్క‌డి దాక వెళ్లి వెనుదిరిగి ప్ర‌త్యామ్నాయ మార్గాల‌లో గ‌మ్య‌స్థానాల‌కు చేరుకుంటున్నారు. ఇదిలా ఉండ‌గా మ‌న్‌సాన్‌ప‌ల్లి బ్రిడ్జీ ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేసి రాక‌పోక‌ల ఇబ్బందుల‌ను తొల‌గించాల‌ని ప‌లువురు కోరుతున్నారు.